ఎమ్మెల్యే నర్సింహయ్య మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2020-12-02T04:46:36+05:30 IST

ఎమ్మెల్యే నర్సింహయ్య మృతి తీరని లోటు

ఎమ్మెల్యే నర్సింహయ్య మృతి తీరని లోటు
నర్సింహయ్య మృతదేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి

  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • మృతదేహానికి నివాళి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసే నాయ కుడిగా నిలిచిపోతారని తెలిపారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


నర్సింహయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటు

ఆమనగల్లు: నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి రాష్ట్రానికి తీరని లోటని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని నర్సింహయ్య నివాసంలో ఆయన మృతదేహాన్ని జైపాల్‌యాదవ్‌ సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సింహయ్య పేదల సంక్షేమం, హక్కుల సాధనకు జీవితాంతం పోరాడారని జైపాల్‌యాదవ్‌ కొనియాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నర్సింహయ్య అందించిన సేవలు మరువరానివన్నారు. నర్సింహయ్య మృతికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్‌, అనురాధాపత్యానాయక్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడురు లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీపీలు మోత్యానాయక్‌, అనితావిజయ్‌ సంతాపం తెలిపారు.

Updated Date - 2020-12-02T04:46:36+05:30 IST