కాలుష్య పరిశ్రమలపై చర్యలు తప్పవు : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-02-08T12:01:24+05:30 IST
సమస్యలకు కారణం అవుతున్న కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. గు రువారం మధ్యాహ్న

కొత్తూర్: సమస్యలకు కారణం అవుతున్న కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. గు రువారం మధ్యాహ్న భోజన అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థిను లు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించి, భోజనాన్ని రుచిచూశారు. భోజన కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మఽధ్యాహ్నం ఒక్కసారిగా దుర్వాసన వచ్చిందని వి ద్యార్థులు, టీచర్లు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తూర్ సమీపంలో పారిశ్రామికవాడలో కెమికల్ పరిశ్రమ వదిలిన విషవాయువు ప్రభావంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చన్నారు. పరిశ్రమల యజమానులు ఇష్టారాజ్యంగా కాలుష్యాన్ని వదిల్తే ఊరుకోం అ న్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని హెచ్‌ఎం భాగ్యమ్మను ఎ మ్మెల్యే ఆదేశించారు. ఆయన వెంట జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్ లక్ష్మయ్య, జగన్, బి.దేవేందర్‌యాదవ్, క్రాంతిరెడ్డి, జనార్దన్‌చారి, రాజు, రవియాదవ్ తదితరులు ఉన్నారు.