గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-12-16T05:17:40+05:30 IST
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- అవుశాపూర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
ఘట్‌కేసర్ రూరల్: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండలంలోని అవుశాపూర్‌లో పల్లెప్రకృతివనం, ఆలయం అదనపు గదులు, ఎదులాబాద్‌లోని దివ్యాంగుల భవనం, వాలీబాల్ క్రీడామైదానాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రతిగ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రిని నిలదీసిన క్రీడాకారులు
అసంపూర్తిగా ఉన్న వాలీబాల్ క్రీడామైదానంలో మౌలికసదుపాయాలు కల్పించకుండానే క్రీడామైదానాన్ని ఎలా ప్రారంభిస్తారని క్రీడాకారులు, స్థానికనాయకులు మంత్రిని నిలదీశారు. మైదానంలో ఎర్రమట్టి పోయలేదని, మరుగుదొడ్లు నిర్మించలేదని ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరుపెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి కలుగజేసుకొని త్వరలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రొటోకాల్ ప్రకారమే శిలాఫలకం ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం క్రీడామైదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణారెడ్డి, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, కావేరిమశ్చేందర్‌రెడ్డి, సురేష్, వెంకట్‌రెడ్డి, అయిలయ్యయాదవ్, లింగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
మేడ్చల్: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును మంత్రి మల్లారెడ్డి మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మేడ్చల్ పట్టణానికి చెందిన లవంగా శాంతాబాయ్‌కు రూ48,500 విలువ గల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక నర్సింహ్మారెడ్డి, భాస్కర్‌యాదవ్, శేఖర్‌గౌడ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్టీసీ కాలనీకి చెందిన కృష్ణారెడ్డి కుటుంబానికి పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్ రూ.10వేలు ఆర్థికసాయాన్ని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి మల్లారెడ్డిఅన్నారు. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం వద్ద రూ.40లక్షలతో చేపట్టిన బీటీరోడ్డు పనులను మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం పశువులకు నట్టల నివారణ మందులను వేశారు. ఆయా కార్యక్రమాల్లో మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి, ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, భాస్కర్‌యాదవ్, శైలజావిజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీహెచ్ శేఖర్‌గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.