రైతాంగానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-31T04:59:07+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతాంగానికి అత్యంత ప్రాధాన్య తనిచ్చి వ్యవసాయరంగంలో

రైతాంగానికి అధిక ప్రాధాన్యం
మన్సాన్‌పల్లిలో అండర్‌డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి

  • విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి


మహేశ్వరం : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతాంగానికి అత్యంత ప్రాధాన్య తనిచ్చి వ్యవసాయరంగంలో నూతనసంస్కరణలు ఆవిష్కరిస్తున్నారని విద్యా శాఖమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండ లంలోని నాగారం, మన్సాన్‌పల్లి, పెండ్యాల, దుబ్బచర్ల, దిలావర్‌గూడ గ్రా మాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగల అనితారెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రైతువేదికలు రైతులకు ఆధునిక దేవాలయాలని, వీటిద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి..వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా మాట్లాడి తగిన సూచ నలు, సలహాలు పొందాలన్నారు. అంతేకాకుండా కరోనా కారణంగా రాష్ర్టానికి ప్రతినెలా వచ్చే ఆదాయం క్షీణించినప్పటికీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని ఆపలేదన్నారు. త్వరలో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆధునిక పద్ధతితో కొలంబో తరహా కందిసాగు, వరిగడ్డితో కొత్త పద్ధతుల్లో సేంద్రియ ఎరువుల తయారీ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కార్యక్రమంలో  మహేశ్వరం ఎంపీపీ కె.రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ సునితఅంద్యానాయక్‌, మండల సమన్వయ సమితి అధ్యక్షుడు పి. రాఘవేందర్‌రెడ్డి, జిల్లా సమన్వయసమితి కూన యాదయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాండుయాదవ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ సురసాని వరలక్ష్మిసురేందర్‌రెడ్డి, సర్పంచులు లావణ్య లింగం, కంది అరుణరమేష్‌, స్లీవారెడ్డి, మంత్రి సంధ్యారాజేష్‌, మోతీలాల్‌, ఎం.రాజునాయక్‌, శివరాజునాయక్‌, మహేశ్వరం ఉపసర్పంచ్‌ దోమ శ్రీనివాస్‌ రెడ్డి, మర్యాద రాఘవేందర్‌రెడ్డి, కుండె వెంకటేష్‌, బి.నర్సింహ, ఎండీవో బి. నర్సింహులు, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ జహంగీర్‌పాషా, దశరథ, నాయ కులు మద్దికరుణాకర్‌రెడ్డి, రాంరెడ్డి, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-31T04:59:07+05:30 IST