-
-
Home » Telangana » Rangareddy » minister mallareddy
-
మునిసిపాలిటీల్లో సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-12-16T04:46:25+05:30 IST
మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నెల కొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు.

- కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నెల కొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, పురపాలక సంఘాల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్‌చైర్‌పర్సన్లతో కలిసి మంత్రి సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మునిసిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయని, అదేవిధంగా పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిందని వాటి మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.