పేదల సంక్షేమమే ధ్యేయం..మంత్రి చామకూర మల్లారెడ్డి
ABN , First Publish Date - 2020-10-21T07:02:09+05:30 IST
ప్రభుత్వం పెదల సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

ఘట్‌కేసర్/మేడ్చల్: ప్రభుత్వం పెదల సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో పోచారంకు చెందిన చెర్ల లావణ్యకు రూ.లక్ష సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఆమె భర్త చెర్ల మధుసుధన్‌రెడ్డికి అందజేశారు. లావణ్యకు అనారోగ్య సమస్య తలెత్తడంతో వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స అవసరమని తెల్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ మండలంలోని మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌కు మంజూరైన రూ.2లక్షల విలువగల చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్, గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్‌రెడ్డి పాల్గొన్నారు.