వలస కూలీలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-04-24T09:52:00+05:30 IST

నాగారం మునిసిపాలిటీలోని రాంప ల్లిలో ఉంటున్న వలస కూలీలను ఆదుకోవాలని ఒకటో వార్డు కౌన్సిలర్‌ చింతల సరిత అధికారులను కోరారు.

వలస కూలీలను ఆదుకోవాలి

కీసర రూరల్‌: నాగారం మునిసిపాలిటీలోని రాంప ల్లిలో ఉంటున్న వలస కూలీలను ఆదుకోవాలని ఒకటో వార్డు కౌన్సిలర్‌ చింతల సరిత అధికారులను కోరారు. గురువారం ఆమె కూలీలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసు కున్నారు. ఈ ప్రాంత ంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల కోసం వచ్చిన కార్మికులు, చెర్లపల్లిలోని పరిశ్రమల్లో విధులు పనిచేసే వందలాది మంది ఉద్యోగులు, వివిధ రంగాల్లో పనివాళ్లు వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రాంపల్లిలో నివసిస్తున్నారని పేర్కొన్నారు.


వారిని గుర్తించి, ప్రభుత్వ సహకారాన్ని అందించటంలో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం ప్రకటించిన విధంగా ఆర్థిక సాయం, బియ్యం అందించడం లేదని ఆరోపించారు. బాధితుల జాబితాను తాను రూపొందించి నివేదించినప్పటికీ మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-04-24T09:52:00+05:30 IST