-
-
Home » Telangana » Rangareddy » meeting for lands distrubution
-
బాధితులకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2020-12-29T05:01:50+05:30 IST
బాధితులకు న్యాయం చేయాలి

- జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి
ఆమనగల్లు : తలకొండపల్లి మండల కేంద్రంలోని 6, 7 సర్వే నెంబర్లలో 1999, 2000 సంవత్సరంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారికి కేటాయించి న్యాయం చేయాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అధికారులకు ఆదేశించారు. ప్లాట్ల కేటాయింపుపై కొన్ని రోజులుగా పేదలు ఆందోళన కార్యక్రమాలు చేపడతున్నారు. ఈ సందర్భంగా ఆచారి సోమవారం హైదరాబాద్ దిల్‌కుష్ గెస్ట్‌హౌ్‌సలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కండెహరిప్రసాద్, పాండు, కుమార్, పద్మ అనిల్, శ్రీనివా్‌సరెడ్డి, రాజు, శేఖర్‌రెడ్డి, హరికాంత్ పాల్గొన్నారు.