-
-
Home » Telangana » Rangareddy » medical personnel
-
వేళకు రాని వైద్య సిబ్బంది
ABN , First Publish Date - 2020-04-07T09:40:46+05:30 IST
కొత్తూర్ మండల పరిధిలోని ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యానికి గురైతే డాక్టర్ పరీక్షించి ఈఎ్‌సఐ డిస్పెన్సరీ

మందుల కోసం కార్మికుల ఎదురుచూపులు
కొత్తూర్: కొత్తూర్ మండల పరిధిలోని ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు అనారోగ్యానికి గురైతే డాక్టర్ పరీక్షించి ఈఎ్‌సఐ డిస్పెన్సరీ ద్వారా అవసరమైన మందులు సరఫరా చేస్తారు. కానీ డాక్టర్లు, వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల కొత్తూర్ డిస్పెన్సరీ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. సోమవారం 11 గంటల వరకు కూడా వైద్య సిబ్బంది రాలేదు. కార్మికులు ఆందోళనకు సిద్దమవుతుండగా సమాచారం తెలుసుకున్న డ్రగ్గిస్ట్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఓపీ చిట్టీలు రాయాల్సిన సిబ్బంది కూడా లేకపోవడంతో కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న స్వీపర్ ఓపీ చిట్టీలు రాయడం గమనార్హం. ఇప్పటికైనా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని కార్మికులు కోరుతున్నారు.