విదేశీ ప్రయాణికుల వివరాలు సేకరణ

ABN , First Publish Date - 2020-03-21T05:58:55+05:30 IST

విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి ఈ నెల ఒకటవ తేదీ తర్వాత

విదేశీ ప్రయాణికుల వివరాలు సేకరణ

కీసర రూరల్‌ : విదేశాల నుంచి నగరానికి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి ఈ నెల ఒకటవ తేదీ తర్వాత నగరానికి వచ్చిన వారిని గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలకు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించేందుకు అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం సమాచారం మేరకు విదేశాల నుంచి 11మంది వచ్చారు. వారిలో 9మందిని గుర్తించారు. 9మంది ఆరోగ్యంగా ఉన్నారని నాగారం మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ రంగనాయకమ్మ తెలిపారు. 

Updated Date - 2020-03-21T05:58:55+05:30 IST