నేలను సంరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-06T05:07:59+05:30 IST

నేలను సంరక్షించుకోవాలి

నేలను సంరక్షించుకోవాలి
మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి

ఘట్‌కేసర్‌: నేలను సంరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా పోచారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మట్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టిక్‌ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎంతో సారంవంతమైన నేలలు ఉన్నాయని దీనితో విస్తారమైన పంటలు పండుతున్నాయని వివరంచారు. తాగునీరు, సాగునీటితోపాటు రమణీయమైన ప్రకృతి సంపదలున్న నేలను రక్షించుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌తోపాటు రసాయన మందులను వాడకుంటే మట్టి కలుషితం కాకుండా ఉంటుందన్నారు. రైతులు సైతం ఆదిశగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ నానావత్‌ రెడ్డియా నాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు గొంగళ్ల మహెష్‌, చింతల రాజశేఖర్‌, సుర్వీ రవిందర్‌, సింగిరెడ్డి సాయిరెడ్డి, బి వెంకటేష్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, ఇంజనీర్‌ సుకృతారెడ్డి పాల్గొన్నారు.


గొంగుపల్లిలో మట్టి దినోత్సవం


పూడూరు: మండల పరిధిలోని గొంగుపల్లి గ్రామంలో శనివారం కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మట్టి దినోత్సవాన్ని రైతులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు రైతులకు వ్యవసాయం, నేల, పరిశోధన, పంటల దిగుబడి, లాభాల గురించి వివరించారు. అనంతరం రైతులకు భూసార కార్డులు అందజేశారు.  

Updated Date - 2020-12-06T05:07:59+05:30 IST