రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-12-21T04:09:07+05:30 IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చైర్మన్‌, సభ్యులను సన్మానిస్తున్న నిర్వాహకులు

తాండూరు మార్కెట్‌ చైర్మన్‌ విఠల్‌నాయక్‌

తాండూరు రూరల్‌: రై తు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తాం డూరు మార్కెట్‌ చైర్మన్‌ విఠల్‌నాయక్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మిట్టబాసుపల్లి, గుంతబాస్పల్లిలో మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.  ఈసందర్భంగా చైర్మన్‌ విఠల్‌నాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ సీఏం రైతు పక్షపాతి అని అన్నారు. రైతుల సక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికల నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నరేందర్‌రెడ్డి, జగదీష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు స్వరూపరెడ్డి, గౌతపూర్‌ ఎంపీటీసీ ఉమశంకర్‌, రాందాస్‌, నాయకలు రామలింగారెడ్డి, రాజుపటేల్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-21T04:09:07+05:30 IST