చెరువులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:15:42+05:30 IST

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

కేశంపేట: మండలంలోని పోమాలపల్లి గ్రామానికి చెందిన పెబ్బె మల్లయ్య(48) అనే వ్యక్తి పోమాలపల్లి- కొండారెడ్డిపల్లి సమీపంలో గల పెద్ద చెరువులో శనివారం శవమై తేలాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మల్లయ్య కొన్ని రోజులుగా అదృశ్యమయ్యాడు. మల్లయ్య కుటుంబీకులు సభ్యులు ఆయన కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు సైతం ఆశలు వదులుకున్నారు. కాగా గత కొన్ని రోజులుగా మల్లయ్య కనిపించడం లేదని సర్పంచ్‌ కృష్ణయ్య, ఉపసర్పంచ్‌ రమే్‌షకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు అనుమానం వచ్చి గ్రామ సమీపంలోని చెరువు పరిసరాల్లో గాలించారు. అక్కడ మల్లయ్య దుస్తులు కనిపించడంతో చెరువులో వెతికించారు. తీరా చెరువులో మల్లయ్య మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో మృతదేహాన్ని వెలికితీయించి అక్కడే ఖననం చేశారు.

Updated Date - 2020-12-06T05:15:42+05:30 IST