నిరుపేదలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-12-14T05:28:45+05:30 IST

నిరుపేదలకు అండగా ఉంటాం

నిరుపేదలకు అండగా ఉంటాం
చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కీసర: నిరుపేదలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈమేరకు కీసర మండల పరిధి  తిమ్మాయిపల్లి గ్రా మానికి చెందిన  లలిత ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ఆమెకు నిధులు మంజురయ్యాయి. ఈ మేరకు మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి అధ్వర్యంలో ఆదివారం మంత్రి మల్లారెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌, సర్పంచ్‌ పెంటయ్య, ఎంపీటీసీ ప్రమీలా అమరేందర్‌రెడ్డి లతో పాటు నాయకులు రాము, మల్లారెడ్డి, జంగయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T05:28:45+05:30 IST