-
-
Home » Telangana » Rangareddy » maisamma
-
వైభవంగా మైసమ్మ బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-07T04:44:10+05:30 IST
వైభవంగా మైసమ్మ బ్రహ్మోత్సవాలు

- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కలెక్టర్ అమయ్‌కుమార్
కడ్తాల్ : కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం అమ్మవారిని శాకాంబరీ దేవిగా వివిధ కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగాయి. ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. పుట్ట వద్ద మహిళలు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మైసిగండి శివాలయాన్ని కలెక్టర్ అమయ్‌కుమార్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్, సర్పంచ్ తులసీరామ్‌నాయక్, ఉప సర్పంచ్ రాజారామ్, పాండు నాయక్, రామావత్ భాస్కర్, మహేశ్వరం తహసీల్దార్ ఆర్.పి.జ్యోతి, నాయకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.