సామూహికం వద్దు... భౌతికదూరమే ముద్దు
ABN , First Publish Date - 2020-04-05T09:50:17+05:30 IST
ప్రజలు కరోనా వ్యాధిని తేలికగా తీసుకోవద్దని, ఇష్టానుసారంగా సంచరించడం మూలంగా ప్రాణాలకే

ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్: ప్రజలు కరోనా వ్యాధిని తేలికగా తీసుకోవద్దని, ఇష్టానుసారంగా సంచరించడం మూలంగా ప్రాణాలకే ప్రమాదముంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రజల నిర్లక్ష్యం కారణంగానే విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం అహర్నిషలు శ్రమిస్తున్నాయని, కరోనా వ్యాధిపై ఇప్పటికే అందరికీ అవగాహన కల్పింస్తున్నట్లు తెలిపారు.
కొందరు మాత్రం అధికారుల సూచనలు పెడ చెవిన పెట్టడం శోచనీయమని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనరాదని, విధిగా భౌతికదూరం పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు పరిశుభ్రతను పాటించాలని అన్నారు. ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను దృష్టిలో పెట్టుకుని వైద్య, పోలీస్ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. మూకుమ్మడిగా పట్టుదలతో ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా సహకరించాలని తెలిపారు.