ఘనంగా జ్యోతిబా పూలే జయంతి

ABN , First Publish Date - 2020-04-12T11:20:47+05:30 IST

మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి పుష్పలత కార్యాలయంలోఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఘనంగా జ్యోతిబా పూలే జయంతి

 చిత్రపటాలు, విగ్రహాలకు నివాళులర్పించిన నాయకులు


వికారాబాద్‌/బంట్వారం/నవాబ్‌పేట్‌ : మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ వెల్ఫేర్‌ జిల్లా అధికారి పుష్పలత కార్యాలయంలోఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే అన్నారు. కార్యక్రమంలో జూనియర్‌అసిస్టెంట్‌ సతీ్‌షకుమార్‌, అటెండర్‌ గంగయ్య పాల్గొన్నారు. కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్‌ గ్రామంలో సర్పంచ్‌ వెంకటే ష్‌యాదవ్‌, ఉపసర్పంచ్‌ సంగారెడ్డిలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో షాకీర్‌, ప్రవీణ్‌, రవి, రామచంద్రి, మల్లేష్‌ పాల్గొన్నారు. నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అక్నాపూర్‌, గేట్‌వనంపల్లి సర్పంచులు అజయ్‌, రత్నం, చిట్టిగిద్ద ఎంపీటీసీ ఎక్బాల్‌, పుల్‌మామిడి మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, ఆర్‌ఎంపీ రమేష్‌ పాల్గొన్నారు. 


తాండూరులో ఘన నివాళి

తాండూరు/యాలాల : జ్యోతిబాపూలే 194వ జయంతిని నాయకులు ఇళ్లలోనే ఘనంగా జరుపుకున్నారు. బీసీ నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌, టీజేఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, కౌన్సిలర్‌ సోమశేఖర్‌ పూలే చిత్రపటాలకు నివాళులర్పించారు. యాలాలలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో జయంతిని జరుపుకున్నారు. కార్యక్రమంలో వ్యకాస జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, నాయకులు పాల్గొన్నారు.


బడుగుల ఆశాజ్యోతి..

పరిగి రూరల్‌/కులకచర్ల: జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పరిగిలోని కోడంగల్‌ చౌరస్తాలో పూలే విగ్రహానికి వివిధ సంఘాల నాయకులు ముకుందా నాగేశ్వర్‌, శ్రీనివాస్‌, రామన్న, జైపాల్‌, మంచన్‌పల్లి శ్రీనివాస్‌, చెన్నయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిట్టకోడూర్‌లో సీపీఎం జిల్లా అధ్యక్షుడు ఎం.వెంకటయ్య నివాళులర్పించారు. కులకచర్ల చౌరస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో శివకుమార్‌, అరవింద్‌కుమార్‌, శ్రీనివాస్‌, వెంకటయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2020-04-12T11:20:47+05:30 IST