‘అందమైన అమ్మాయికి పొగరెక్కువ-నా లారీకి స్పీడెక్కువ’ అని రాసినందుకు..

ABN , First Publish Date - 2020-03-18T13:41:41+05:30 IST

తాండూరులో నాపరాయి లోడింగ్‌ చేసే లోకల్‌ లారీ వెనుక ‘అందమైన అమ్మాయికి పొగరెక్కువ-నా లారీకి...

‘అందమైన అమ్మాయికి పొగరెక్కువ-నా లారీకి స్పీడెక్కువ’ అని రాసినందుకు..

ట్రక్కు వెనుక అభ్యంతరకర రాతలు

లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు

తాండూరు రూరల్‌(రంగారెడ్డి జిల్లా): తాండూరులో నాపరాయి లోడింగ్‌ చేసే లోకల్‌ లారీ వెనుక  ‘అందమైన అమ్మాయికి పొగరెక్కువ-నా లారీకి  స్పీడెక్కువ’ అని రాసుకుని నడుపుతున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని మంగళవారం గౌతాపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ29టీ3784 నెంబర్‌గల లారీ గత కొన్ని రోజులుగా ఓగీపూర్‌ నాపరాతి గని నుంచి తాండూరులో లోడింగ్‌ అన్‌లోడింగ్‌ చేస్తుంది.


ఆ లారీని ఆపి డ్రైవర్‌ బస్వరాజ్‌ను కరన్‌కోట్‌ పోలీసులు విచారించారు. అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఈ విధంగా రాయడం నేరమని తెలియజేసి, అలాంటి రాతలను తొలగించి ‘కీప్‌ డిస్టెన్స్‌ 50ఫీట్స్‌’ అని రాయించి వదిలిపెట్టారు. 130/177ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఎవరైనా వాహనాల చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా అసభ్యకర రాతలు రాస్తే చర్యలు తీసుకుంటామని సీఐ జలందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-03-18T13:41:41+05:30 IST