శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2020-12-30T04:44:56+05:30 IST

శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం

శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం
కల్యాణాన్ని జరిపిస్తున్న అర్చకులు

  • పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి

ఆమనగల్లు  : తలకొండపల్లి మండలం రాంపూర్‌ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మలశ్రీశైలంగౌడ్‌, మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్పంచ్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి మోహన్‌రావుల ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు మంత్రోచ్ఛరణ నడుమ స్వామివారి కల్యాణం జరిపించారు. అనంతరం అతిథులు, స్వామివారికి పూజలు చేశారు. నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. 


సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

తలకొండపల్లి మండలం మాదాయిపల్లికి చెందిన ఎమ్‌.బుజ్జమ్మకు రూ.60వేలు ఎ.శేఖర్‌కు రూ.60వేలు, గట్టిప్పలపల్లికి చెందిన సీహెచ్‌.శ్రీనివా్‌సకు రూ.12వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మంగళవారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రఘురాములు, శ్రీశైలం, రాజేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:44:56+05:30 IST