అర్ధరాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ఘోరం.. లోకో పైలెట్‌ దుర్మరణం

ABN , First Publish Date - 2020-07-28T17:36:41+05:30 IST

రైలు ఢీకొన్న ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఓ లోకో పైలెట్‌ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి చత్తీస్‌ఘడ్‌లో చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వద్ద పీఆర్‌వోగా పనిచేస్తున్న

అర్ధరాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ఘోరం.. లోకో పైలెట్‌ దుర్మరణం

మృతుడు ఎమ్మెల్సీ పీఆర్‌వో కుమారుడు 


వికారాబాద్‌ (ఆంధ్రజ్యోతి) : రైలు ఢీకొన్న ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఓ లోకో పైలెట్‌ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి చత్తీస్‌ఘడ్‌లో చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వద్ద పీఆర్‌వోగా పనిచేస్తున్న మల్లారెడ్డి రెండవ కుమారుడు ప్రకాష్‌రెడ్డి (24) చత్తీస్‌ఘడ్‌లో లోకో రైలు పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకుని రాస్మారా రైల్వేస్టేషన్‌లో దిగి ఇంటికి వెళ్లడానికి పట్టాలు దాటుతున్న సమయంలో మరో వైపు నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రకాష్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. భోపాల్‌ ఎన్‌ఐటీలో ఎంటెక్‌ పూర్తి చేసిన ప్రకాష్‌రెడ్డి అక్కడే పీహెచ్‌డీ చేస్తుండగా గత ఏడాది సెప్టెంబర్‌లో లోకో పైలెట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎదిగిన కొడుకు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో మృతుడి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. మృతదే హం మంగళవారం మధ్యాహ్నం వరకు బషీరాబాద్‌ మండలంలోని వారి స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2020-07-28T17:36:41+05:30 IST