లాక్‌డౌన్‌ పాటించాల్సిందే

ABN , First Publish Date - 2020-03-27T12:08:18+05:30 IST

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా నిబంధనల ప్రకారం లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. గురువారం పరిగిలో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ

లాక్‌డౌన్‌ పాటించాల్సిందే

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు


పరిగి: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా నిబంధనల ప్రకారం లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. గురువారం పరిగిలో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలుకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సరుకుల కొనుగోళ్లకు ఉదయం ఆరు నుంచి 9గంట ల వరకు దుకాణాలు తెరిచిఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపు కార్డులున్న వారినేఅనుమ తివ్వాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, సీఐ లక్ష్మీరెడ్డి ఉన్నారు. 


అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు పరిశీలన..

కొడంగల్‌/కొడంగల్‌ రూరల్‌/బొంరా్‌సపేట్‌:లాక్‌డౌన్‌తో గ్రామాలకు ఇతర ప్రా ంతాల నుంచి ప్రజలు రాకుండా రోడ్డపై ముళ్ల కంచెలు వేసుకుంటున్నారు. కర్ణాట క సరిహద్దు రావుల్‌పల్లి, రెబ్బన్‌పల్లి చెక్‌పోస్టులను గురువారం వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమి బసు, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలి ంచారు. రాకపోకలను కట్టడి చేశారు. అన్నారంలో రోడ్డుపై కంచెలు ఏర్పాటు చేశా రు. ఎరన్‌పల్లిలో జేసీబీతో రోడ్డు తవ్వేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక్కో వ్యక్తికి 12కిలోల చొప్పున బియ్యాన్ని తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌ బి య్యం పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో గ్రామాల్లో వీదులు నిర్మానుష్యంగా మారాయి.


కొడంగల్‌ మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లే దు. బొంరా్‌సపేట్‌ మండలంలో వైద్య సిబ్బంది, పంచాయతీ రాజ్‌ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంపీడీఓ హరినందన్‌రావు, ఇతర అధికారులు ట్రాక్టర్‌పై గ్రామాల్లో తిరుగుతూ కరోనా జాగ్రత్తలు వివరించారు. ఒకరినొకరు దూరాన్ని పాటించాలని చెప్పారు.


ఇళ్ల నుంచి బయటికి రావద్దు

పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెరెడ్డి 

పరిగి: లాక్‌డౌన్‌లో భాగంగా ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పరిగి ఎమ్మె ల్యే కె.మహేశ్‌రెరెడ్డి అన్నారు. గురువారం పరిగి మర్కెట్‌లో రైతులతో మాట్లాడి మాస్క్‌లను పంపిణీ చేశారు. ఉచితంగా బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఆ యన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, నాయకులు ఆర్‌.ఆంజనేయకులు, ప్రవీణ్‌రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, కిరణ్‌, మునీర్‌ ఉన్నారు. 

Updated Date - 2020-03-27T12:08:18+05:30 IST