కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఎల్‌ఎన్‌ కాలనీ

ABN , First Publish Date - 2020-06-18T10:15:03+05:30 IST

పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది.

కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఎల్‌ఎన్‌ కాలనీ

షాద్‌నగర్‌: పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. 13న ఎల్‌ఎన్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడగా, అతని భార్య, కూతురు, బంధువు కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని మంగళవారం రాత్రి వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎల్‌ఎన్‌ కాలనీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి కాలనీ ముఖద్వారంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.


కిరాణ, మొబైల్‌ షాపుల వేళల్లో మార్పు

పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిరాణ, మొబైల్‌ షాపుల పనివేళల్లో మార్పులు చేశారు. ఆయా షాపుల అసోసియేషన్ల సూచన మేరకు పట్టణంలోని అన్ని కిరాణ దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మొబైల్‌ షాపులు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-06-18T10:15:03+05:30 IST