మొక్కలను సంరక్షించుకుందాం

ABN , First Publish Date - 2020-05-09T09:30:46+05:30 IST

హరితహారంలో మొక్కలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి

మొక్కలను సంరక్షించుకుందాం

కొత్తూర్‌ : హరితహారంలో మొక్కలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలని జడ్పీటీసీ శ్రీలతసత్యనారాయణ, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వాటరింగ్‌డేను పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో నాటిన మొక్కలకు ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులు శుక్రవారం నీరు పోసే కార్యక్రమం నిర్వహించారు. మధుసూదన్‌రెడ్డి మల్లాపూర్‌ గ్రామంలో, ఎస్‌బీ పల్లిలో శ్రీలతసత్యనారాయణ మొక్కలకు నీరు పోశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో జ్యోతి, ఎంపీవో దీపాల శ్రీనివాస్‌, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-09T09:30:46+05:30 IST