హోం ఐసోలేషన్‌ వైపే మొగ్గు

ABN , First Publish Date - 2020-07-15T09:56:02+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వారంరోజులుగా మేడ్చల్‌జిల్లాలో రెట్టింపు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

హోం ఐసోలేషన్‌ వైపే మొగ్గు

ఆస్పత్రుల్లో చేరేందుకు కొవిడ్‌ బాధితుల అనాసక్తి

అత్యవసరమైతేనే చేరిక

ఆస్పత్రి ఐసోలేషన్‌లో 300, 

హోం ఐసోలేషన్‌లో 2,343 మంది


కరోనా బాధితులు ఆస్పత్రులకు వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరాలంటే జంకుతున్నారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయో అన్న అనుమానంతో ఆందోళన చెందుతున్నారు. అత్యవసరమైతే తప్ప వెళ్లడం లేదు. హోం క్వారంటైన్‌లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకోవడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వారంరోజులుగా మేడ్చల్‌జిల్లాలో రెట్టింపు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఏ జబ్బు చేసినా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మొదటగా కొవిడ్‌-19 పరీక్షలు చేసిన తర్వాతే వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం అనుమానితులం దరికీ పరీక్షలు చేస్తుండటంతో పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పాజిటివ్‌ రాగానే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరాలంటే జంకుతున్నారు.


సౌకర్యాలు ఎలా ఉన్నాయో అన్న అనుమానంతో ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంటి వద్ద ప్రత్యేక గది పరిశుభ్రంగా ఉంటే హోంఐసోలేషన్‌లో ఉండేందుకు వైద్యులు అనుమతినిస్తున్నారు. ఎవరికైతే శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండటం.. విపరీతంగా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు మాత్రమే ఆస్ప త్రుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన ప్పటికీ, యాక్టివ్‌గా ఉన్నవారు మాత్రం హోంఐసోలేషన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మొత్తం 4,516 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 3,864, మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 598, గ్రామీణ ప్రాంతాల్లో 54వరకు ఉన్నాయి. వీరిలో 28మంది మృతి చెందారు. ఇప్పటివరకు 1,845 మంది డిశ్చార్జి అయ్యారు. 2,643 యాక్టివ్‌ కేసులున్నాయి.


ఈ కేసుల్లో అధిక మొత్తంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఆస్పత్రి ఐసోలేషన్‌లో కేవలం 300మంది మాత్రమే ఉండగా, హోం ఐసోలేషన్‌లో 2,343 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో హోంఐసోలేషన్‌లో ఉండేవారి సంఖ్య రోజు రోజుకూ పెరు గుతోంది. దీంతో వీరికి మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి టెలీ కాన్ఫరెన్స్‌. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కార్పొరేట్‌ స్థాయిలో వైద్యాన్ని అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ ఉన్నవారితో 10 మంది సీనియర్‌ వైద్యుల బృందం, జిల్లా సర్వేలైన్స్‌ అధికారితో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. నిత్యం టెలీకాలింగ్‌ కేంద్రం ద్వారా ఫోన్‌చేసి వారిలో ఽధైర్యాన్ని నింపేందుకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లో విటమిన్‌ సీ, విటమిన్‌ బీకాంప్లెక్స్‌, జింక్‌, ఉన్నటువంటి మందులను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు హోంఐసోలేషన్‌లో ఉన్న 487మందికి అందించారు. వైద్యుల సూచ నల మేరకు మందులు, భోజనం తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 


నిత్యం పర్యవేక్షణ

కరోనా నివారణలో భాగంగా ముందుండి పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి కూడా పాజిటివ్‌ వస్తుంది. దీంతో జిల్లాయంత్రాంగం అప్ర మత్తమైంది. ఈనేపథ్యంలో 10 మంది వైద్యుల బృందంతో మందులు సరఫరా, టెలీకాలింగ్‌, వీడియోకాలింగ్‌ ద్వారా మానసిక స్థైర్యం నిం పేందుకు చర్యలు తీసు కుంటున్నారు. 

Updated Date - 2020-07-15T09:56:02+05:30 IST