నాయకులను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-09-12T10:04:23+05:30 IST

సెంబ్లీ ముట్టడిలో భాగంగా అరెస్టు చేసిన అఖిల భారత గిరిజిన సమాఖ్య (ఏఐటీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు వెంకన్న ..

నాయకులను విడుదల చేయాలి

వికారాబాద్‌: అసెంబ్లీ ముట్టడిలో భాగంగా అరెస్టు చేసిన అఖిల భారత గిరిజిన సమాఖ్య (ఏఐటీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు వెంకన్న నాయక్‌, ఇతర గిరిజన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఏఐటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవన్‌నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ప్రభుత్వం అరెస్టు చేసిన ఏఐటీఎఫ్‌ నాయకులను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జాదవ్‌ మహేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరంసింగ్‌, జిల్లా సెక్రటరీ రమే్‌షనాయక్‌, వికారాబాద్‌ డివిజన్‌ అధ్యక్షుడు బాబునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T10:04:23+05:30 IST