ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-03-12T06:40:15+05:30 IST

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటన నంచర్ల-గండీడ్‌ మండల పరిధిలోని లింగాయిపల్లి వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

తాండూరు/తాండూరు రూరల్‌ : ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటన  నంచర్ల-గండీడ్‌ మండల పరిధిలోని లింగాయిపల్లి వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాండూరు డిపోకు చెందిన బస్సు 30 మంది ప్రయాణికులతో మహబూబ్‌నగర్‌కు వెళ్తుంది. ఈ క్రమంలో నంచర్ల సమీపంలోని లింగాయిపల్లి వద్దకు రాగానే మహబూబ్‌నగర్‌ నుంచి ఎదురుగా వస్తున్న లారీని డ్రైవర్‌ జల్లన్న అతివేగం, అజాగ్రత్తగా బస్సును ఢీ కొట్టాడు. దీంతో లారీ డ్రైవర్‌ అహ్మద్‌, బస్సు డ్రైవర్‌ అహ్మద్‌తోపాటు కండక్టర్‌ మీనాకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సును డ్రైవర్‌ ఎడమవైపు మళ్లించడంతో ప్రయాణికులంతా ప్ర మాదం నుంచి సురక్షితంగా బయటపడినట్టు డీఎం రాజశేఖర్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-12T06:40:15+05:30 IST