చిలుకూరులో ధర్మరక్ష జ్యోతి

ABN , First Publish Date - 2020-09-13T09:04:20+05:30 IST

అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని దగ్దం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ..

చిలుకూరులో ధర్మరక్ష జ్యోతి

అంతర్వేది ఘటనలో నిందితులను శిక్షించాలి

చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు సీఎస్‌ రంగరాజన్‌


మొయినాబాద్‌ రూరల్‌: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథాన్ని దగ్దం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ డిమాండ్‌ చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలునివ్వడంతో రంగరాజన్‌ స్పందించి చిలుకూరు  ఆలయ అవరణలో శనివారం దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో కొలువుదీరే భగవంతునికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించాలనే ఉద్యమానికి ఇదొక ముందడుగని తెలిపారు. ఇదే విషయమై రాష్ట్రపతికి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు.

Updated Date - 2020-09-13T09:04:20+05:30 IST