క్యామ మల్లేష్‌ గతాన్ని గుర్తుంచుకోండి

ABN , First Publish Date - 2020-03-20T08:03:21+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామమల్లేష్‌ కాంగ్రె్‌స్టలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, జనహితం కోసం పాటుపడుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి...

క్యామ మల్లేష్‌ గతాన్ని గుర్తుంచుకోండి

యాచారం: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామమల్లేష్‌ కాంగ్రె్‌స్టలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని, జనహితం కోసం పాటుపడుతున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నిందలు వేయడం తగదని ప్రముఖ పర్యావరణ వేత్త కవులసరస్వతి, నానక్‌నగర్‌ దంతుకపెద్దయ్య, మాజీ సర్పంచ్‌ ముత్యాల వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం వారు యాచారంలో మాట్లాడుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని వి మర్శించడం తగదన్నారు. ఫార్మాకంపెనీలు ప్రజల జీవితాలను పాడుచేస్తున్నాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎకరానికి  రూ.12.5 లక్షలు ఇచ్చి జనాలను ముంచుతున్నారని తమరు విమర్శించ లేదా? అని ప్రశ్నించారు. 


Updated Date - 2020-03-20T08:03:21+05:30 IST