కదంతొక్కిన కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2020-10-03T09:40:40+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వీడాలని, కార్పొరేట్‌ ..

కదంతొక్కిన కాంగ్రెస్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలి

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 

పలు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలు


మహేశ్వరం/షాబాద్‌/కడ్తాల్‌/ఆమనగల్లు/యాచారం/షాద్‌నగర్‌/కొత్తూర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వీడాలని, కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం మానుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మ హేశ్వరంలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కిసాన్‌ మ జ్దూర్‌ బచావో దివస్‌ను పురస్కరించుకొని రైతుల సంతకాల సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వ్యవసా య వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ.1లక్ష రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, సీనియర్‌ నాయకుడు దేపభాస్కర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కాకి ఈశ్వర్‌, కృష్ణానాయక్‌, జంపన్నయాదవ్‌, జానకీరాం, ధన్‌రాజుగౌడ్‌, అల్లె కుమార్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, బాబు పాల్గొన్నారు.  దేశ ంలో దళితులు, మహిళలపై జరుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి ఎ.చంద్రశేఖర్‌ అన్నారు.


షాబాద్‌లో పార్టీ కా ర్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ... యూపీలో బాలికపై అత్యాచారం చేసి చంపిన సంఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన రాహుల్‌గాంధీ, ప్రియాంకలకు అనుమతి ఇ వ్వకపోవడం అధికార పార్టీ దురాగతానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు ఎలుగంటి మధుసూ దన్‌రెడ్డి, పిసరి సురేందర్‌రెడ్డి, రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పామెన భార్గవరామ్‌, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సీనియర్‌ నాయకు లు చేవెళ్ల స్వామి, దేశమొల్ల ఆంజనేయులు, చింపుల సత్యనారాయణరెడ్డి, సున్నం వసంతం, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, మల్లేష్‌, అశోక్‌, సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, రవీందర్‌, శేఖ ర్‌, అక్తర్‌, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరే క విధానాలను నిరసిస్తూ కడ్తాలలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు యాట నర్సింహా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ నాయకు డు చేగూరి వెంకటేశ్‌, మండలకో-ఆప్షన్‌ సభ్యుడు జహాంగిర్‌ బాబా, మాజీ ఎంపీటీసీ గురిగళ్ల లక్ష్మయ్య, రేవంత్‌  మిత్ర మండలి రాష్ట్ర అ ధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ, నాయకులు మల్లేశ్‌గౌడ్‌, రామ్‌చందర్‌నాయక్‌, మల్లయ్య, మంకి శ్రీను, రాజేశ్‌, రాజేందర్‌గౌడ్‌, సుధాకర్‌గౌడ్‌, పిప్పళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎంపీ రాహుల్‌ గాంధీని, ప్రియాంకగాంధీల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ ఆమనగల్లులో కాంగ్రెస్‌ నిరసన నాయకులు చేపట్టారు. మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మండ్లీ రాములు ఆధ్వర్యంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ ఉ పాధ్యక్షుడు ఎంఏ.ఖలీల్‌, జిల్లా యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణానాయక్‌, తాలుకా ప్రధాన కార్యదర్శి వస్పుల శ్రీశైలం, నాయకులు అలీమ్‌, కిషన్‌నాయక్‌, మల్య, శివ, గోపాల్‌, మహేశ్‌, రాజేశ్‌, రాజు, సురేశ్‌నాయక్‌, రాఘవేందర్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నా రు. యాచారంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహా ఆధ్వర్యం లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వైస్‌ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎం.సుతన్‌రెడ్డి, వెంకటరెడ్డి, రాజేందర్‌రెడ్డి, భాస్కర్‌, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.


కేంద్ర ప్రభుత్వం రైతులను చులకనగా చూస్తోందని కాంగ్రెస్‌ పా ర్టీ షాద్‌నగర్‌ తాలూకా ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఫరూఖ్‌ నగర్‌ మండలం ఎలికట్టలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో బాబర్‌ ఖాన్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, మాధవులు పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీపై దా డికి నిరసనగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వ ర్యంలో కొత్తూర్‌లో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకు లు రాధాకృష్ణ, శ్రీనివాస్‌, సుధీర్‌, శ్రీను, నర్సింలు, వెంకటేష్‌, రాజు, నర్సింహా, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T09:40:40+05:30 IST