విండో డైరెక్టర్ల పదవులన్నీ ఏకగ్రీవం

ABN , First Publish Date - 2020-02-12T09:22:38+05:30 IST

ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో కొడంగల్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఎన్నికకు మార్గం సుగమమైంది. కొడంగల్‌ సొసైటీ

విండో డైరెక్టర్ల పదవులన్నీ ఏకగ్రీవం

  • సొసైటీ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఎన్నికకు మార్గం సుగమం
  • డీసీసీబీ రేసులోనూ ఉన్న సీనియర్‌ నేత

కొడంగల్‌: ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో కొడంగల్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఎన్నికకు మార్గం సుగమమైంది. కొడంగల్‌ సొసైటీ డైరెక్టర్‌గా గెలుపొ ందిన ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవి కోసం రేసులో ముందున్నా రు. హస్నాబాద్‌ సొసైటీ పరిధిలో 13మంది డైరెక్టర్ల కు గాను 9మంది టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు, నలుగురు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎ న్నికల సమయంలో గురునాథ్‌రెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌ పదవి ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు హామీ ఇచ్చారు. దీంతో ఆయన కొడంగల్‌ సొసైటీ చైర్మన్‌ పదవికి  పోటీ చేశారు. ఈ చైర్మ న్ల నుంచే ఒకరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికవుతారు. దీంతో గుర్నాథరెడ్డి మొదటి మొట్టు ఎక్కినట్టయింది. డీసీసీబీ చైర్మన్‌గా ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం సైతం ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. గురునాథ్‌రెడ్డి 1వ వార్డు నుంచి డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికడం గమనార్హం. ఈ నెల 15 తరువాత డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక లాంఛ నమే అని తెలుస్తోంది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన గుర్నాథరెడ్డి డీసీసీబీ చైర్మన్‌ పద వి ఇవ్వడం సముచితంగా ఉంటుందని పార్టీ వర్గాలు సైతం అంటున్నాయి. ఎమ్మెల్యే కంటే ముందు ఆయన కొడంగల్‌ సర్పంచ్‌గా పనిచేశారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు పూర్తయి సొసైటీల చైర్మన్ల ఎం పిక పూర్తవగానే డీసీసీబీ చైర్మన్‌గా గుర్నాథ రెడ్డిని ఎన్నుకోనుట్టు తెలుస్తోంది.


Updated Date - 2020-02-12T09:22:38+05:30 IST