కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-11-27T04:33:58+05:30 IST
కేజీబీవీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

యాలాల : కేజీబీవీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాలాలలోని కేజీబీవీ పాఠశాల వర్కర్లు బాలమణి, యాదమ్మ, సంతోష, కవిత , వెంకటమ్మ పేర్కొన్నారు. గురువారం వారు పాఠశాల ఎదుట కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ వర్కర్లు అమృత, నవనీత, పుష్ప, అనిత తదితరులు పాల్గొన్నారు.