సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం

ABN , First Publish Date - 2020-12-18T04:49:09+05:30 IST

సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం

సర్వేకు వచ్చిన అధికారులతో వాగ్వాదం
అధికారులతో వాగ్వివాదం చేస్తున్న కేశ్వాపూర్‌ రైతులు

శామీర్‌పేట: నగరానికి తాగునీటి కోసం కేశ్వాపూర్‌లో చేపట్టిన రిజర్వాయర్‌కు సంబంధించి గురువారం సర్వేకు వచ్చిన అటవీశాఖ అధికారులతో భూములు కోల్పోతున్న రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రామంలో దళిత రైతులు సాగు చేస్తున్న భూములు అటవీశాఖకు చెందినవని అధికారులు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని 118 సర్వే నెంబర్‌సుమారు 95 ఎకరాల భూముల్లో వందమంది దళితరైతులు సాగు చేసుకుటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఈ భూములకు తెలంగాణ  ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందినప్పటికీ అటవీ శాఖకు సంబంధించినవేనంటూ అధికారులు సర్వేకు రావటంతో కేశ్వాపూర్‌ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిహారం అందించేందుకు ఒప్పుకున్నా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నందున తమకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సర్పంచ్‌ ఇస్తారిని దళిత రైతులు కోరారు. సీఎంను కలిసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2020-12-18T04:49:09+05:30 IST