కరోనాతో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST

కరోనా మరణాలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గురువారం ఇద్దరు మృతి చెందారు.

కరోనాతో ఇద్దరి మృతి

   (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): కరోనా మరణాలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గురువారం ఇద్దరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 200కు చేరుకుంది. మేడ్చల్‌ జిల్లాలో మృతుల సంఖ్య గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మేడ్చల్‌ జిల్లాలో మృతుల సంఖ్య 98కి చేరుకోగా వికారాబాద్‌ జిల్లాలో 56కు చేరుకుంది. 

236 కేసులు.. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 85 కేసులు నమోదు కాగా వికారాబాద్‌ జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. మేడ్చల్‌ జిల్లాలో 150 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో కరోనాబాధితుల సంఖ్య 1,08,911కు చేరుకుంది. 


Updated Date - 2020-12-10T05:30:00+05:30 IST