సొంతూళ్లకు కర్ణాటక వాసులు

ABN , First Publish Date - 2020-12-28T05:23:25+05:30 IST

సొంతూళ్లకు కర్ణాటక వాసులు

సొంతూళ్లకు కర్ణాటక వాసులు
కొడంగల్‌ బస్టాండ్‌ వద్ద కర్ణాటక ప్రయాణికుల రద్దీ

పంచాయతీ ఎన్నికలకు వెళ్తుండగా కొడంగల్‌లో రద్దీ

కొడంగల్‌రూరల్‌: బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్‌ తదితర పట్టణాలకు వలసవచ్చిన కర్ణాటక రాష్ట్ర ప్రజలు తమ రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూళ్లకు పయనమై వెళ్లారు. కర్నాటక రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఉండటంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లారు. దీంతో హైదరాబాద్‌ డిపో-1, డిపో-2తో పాటు మెహిదీపట్నం ఆర్టీసీ డీపోల నుంచి కొడంగల్‌ వరకు బస్సులను ప్రత్యేకంగా నడిపారు. దీంతో ఆదివారం కొడంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. 

Updated Date - 2020-12-28T05:23:25+05:30 IST