ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-12-14T05:24:16+05:30 IST

ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి

ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలి
భక్తులతో మాట్లాడుతున్న కమలానందభారతి స్వామి

శ్రీ కమలానందభారతి స్వామి


ఘట్‌కేసర్‌ రూరల్‌: సమాజంలో ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని కమలానంద భారతి స్వామి అన్నారు. మండలంలోని అంకుశాపూర్‌ భవానిశంకర శివపంచాయతన శ్రీ స్పటికలింగేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీకమలానందభారతి స్వామి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్తీకమాసం నేటితో ముగియడానికి ఒక్కరోజు ముందు ఆలయానికి వచ్చిన స్వామికి భక్తులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్పటికలింగేశ్వరునికి ప్రత్యేకపూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలన్నారు. దైవసన్నిధిలో కొంత సమయం కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శోభారాణి, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రావు, వై.శ్రీనివా్‌సరెడ్డి, నర్సింహారెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, పిట్టల రాజు, కాళిదాసు, బద్దం మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T05:24:16+05:30 IST