కనుల పండువగా శివపార్వతుల కల్యాణం

ABN , First Publish Date - 2020-12-14T05:14:49+05:30 IST

కనుల పండువగా శివపార్వతుల కల్యాణం

కనుల పండువగా శివపార్వతుల కల్యాణం
శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తున్న అర్చకులు

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని శ్రీమార్కండేయ ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలో మేదరి బాలయ్యసులోచన దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు నాగభూషణం, శరత్‌ వైభవంగా శివపార్వతుల కల్యాణాన్ని జరిపించారు. వేడుకలను తిలకించడానికి పట్టణ ప్రజలు, శివ స్వా ములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మామిడి శెట్టి మల్లయ్య, చెర్కు యాదగిరి, గాజుల పుల్లయ్య, నాగిళ్ల శ్రీనివాస్‌, పల్లె సత్యం, గోపాల్‌, కుమార్‌గౌడ్‌, రమేశ్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T05:14:49+05:30 IST