కలకొండ ఏఈవో సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-08-16T09:56:13+05:30 IST

రైతుబంధు క్లెయిములో అవకతవకలకు పాల్పడిన మాడ్గుల మండలం కలకొండ క్లస్టర్‌ గ్రేడ్‌-2 వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్‌.దేవేందర్‌పై సస్పెన్షన్‌ వేటు

కలకొండ ఏఈవో సస్పెన్షన్‌

ఇబ్రహీంపట్నం : రైతుబంధు క్లెయిములో అవకతవకలకు పాల్పడిన మాడ్గుల మండలం కలకొండ క్లస్టర్‌ గ్రేడ్‌-2 వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్‌.దేవేందర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైతుబంధుకు సంబంధించి దుర్గంపూడి అరుణ్‌ అనే రైతు వివరాలు రైతుబంధు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అధికారి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తగు విచారణ జరిపించారు. ఏఈవో దేవేందర్‌ అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో అతన్ని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌  అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-08-16T09:56:13+05:30 IST