-
-
Home » Telangana » Rangareddy » Junctions enquiry
-
జంక్షన్ల వద్ద ప్రమాదాలను నివారిస్తాం
ABN , First Publish Date - 2020-12-20T04:36:57+05:30 IST
జంక్షన్ల వద్ద ప్రమాదాలను నివారిస్తాం

శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్
కొత్తూర్: జాతీయ రహదారి (44వ)పై ఉన్న జంక్షన్ల వద్ద ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. తిమ్మాపూర్ సమీపంలోని చేగూర్ చౌరస్తా వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తెలుసుకున్న ఏసీపీ, షాద్‌నగర్ ఏసీపీ సురేందర్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 44వ జాతీయ రహదారిపై ఉన్న జంక్షన్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలపై రాయికల్ టోల్‌గేట్ అధికారులు, స్థానిక అధికారులతో కలిసి చర్చించారు. ప్రమాదాల నివారణ కోసం చేపట్టవల్సిన జాగ్రత్తలపై తగు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ విశ్వప్రసాద్ మా ట్లాడుతూ వాహనాల వేగాన్ని తగ్గించేందుకు జంక్షన్ల వద్ద భారీగా రంబుల్‌స్ట్రిప్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మెరుగైన బటర్‌ఫ్లై లైట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాహనచోదకులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో స్థానిక ఇన్‌స్పెక్టర్ భూపాల్‌శ్రీధర్, షాద్‌నగర్ ఎంవీఐ చినబాలు, కొత్తూ ర్ మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ జ్యోతి, టోల్‌ప్లాజా సేఫ్టీ మేనేజర్ రాజేంద్రప్రసాద్, మెయింటెనెన్స్ మేనేజర్ విశ్వనాథం పాల్గొన్నారు.