సమాచారం లేకుండా చేరితే తీవ్ర పరిణామాలు
ABN , First Publish Date - 2020-05-17T09:32:08+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వ పఽథకాలకు ఆకర్షితులై ఎవరైనా పార్టీలో చేరేవారిని పార్టీ నియమ నిబంధనలు, సిద్ధాంతాలకు లోబడి పార్టీలో చేర్చుకుంటామని మండల

ఎమ్మెల్యే అనుమతితోనే కొత్త వారికి పార్టీలోకి ఆహ్వానం
పార్టీ సిద్ధాంతాలకు లోబడి నడుచుకోవాలని తీర్మానం
కడ్తాల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో
నాయకుల స్పష్టీకరణ
కడ్తాల్: టీఆర్ఎస్ ప్రభుత్వ పఽథకాలకు ఆకర్షితులై ఎవరైనా పార్టీలో చేరేవారిని పార్టీ నియమ నిబంధనలు, సిద్ధాంతాలకు లోబడి పార్టీలో చేర్చుకుంటామని మండల టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. శనివారం ఎంబీఏ గార్డెన్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన కడ్తాల మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, గంప వెంకటేష్, జోగు వీరయ్య, జహంగీర్‌బాబా, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక నాయకత్వం, నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను సంప్రదించకుండా ఎవరు పార్టీలో చేరిన తీవ్ర పరిణామాలు తప్పవని వారు పేర్కొన్నారు.
అదేవిధంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నిరుపేదలకు చేయూత, ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చిం చారు. ఈ సమావేశంలో నాయకులు లచ్చిరాంనాయక్, గోపాల్, రమేష్, మంజుల, కృష్ణయ్య, భారతమ్మ, నర్సింహ, యాదయ్య, తులసీరాంనాయక్, హరిచంద్ నాయక్, బిచ్చా, దేవ, సులోచన, రామకృష్ణ, లగుపతి నాయక్ పాల్గొన్నారు.
కాంగ్రె్‌స్‌కు కడ్తాల్ ఎంపీపీ రాజీనామా
కడ్తాల్ ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని డీసీసీ ఆధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి పంపినట్లు ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభు త్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పఽథకాలకు ఆకర్షితు రాలినై, మండలాభివృద్ధిని కాంక్షించి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు.