జనతా కర్ఫ్యూ విజయవంతం

ABN , First Publish Date - 2020-03-23T06:24:34+05:30 IST

ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ నివారణకు జనతా కర్ఫ్యూని విధించాయి. దీంట్లో భాగంగా ప్రజలు తామంతట...

జనతా కర్ఫ్యూ విజయవంతం

  •  ఇళ్లలోనే ప్రజలు.. నిర్మానుష్యంగా మారిన ప్రధాన రోడ్లు,  చౌరస్తాలు

 శామీర్‌పేట రూరల్‌ : ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ నివారణకు జనతా కర్ఫ్యూని విధించాయి. దీంట్లో భాగంగా ప్రజలు తామంతట తాము   ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారు. మూడుచింతలపల్లి మండల కేంద్రంతో పాటు లక్ష్మాపూర్‌, నారాయణపూర్‌, అనంతారం, కొల్తూర్‌, జగ్గంగూడ, ఉద్దెమర్రి, అద్రా్‌సపల్లి, కేశవరం, పోతారం, లింగాపూర్‌తండా తదితర గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.   పలు గ్రామపంచాయతీల్లో మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. గ్రామపంచాయతీల సిబ్బంది ప్రత్యేకంగా గస్తీలు చేపట్టారు.  బయటకు వచ్చిన వారిని తిరిగి ఇండ్లకు పంపించే విధంగా పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. దీంతో మండలంలోని ప్రధాన రోడ్లతో పాటు గల్లీలు కూడా నిర్మానుష్యమయ్యాయి. అత్యవసర పరిస్థితిల్లో వచ్చిన వారు మాస్కులు దరించి వారి పనులను పూర్తి చేసుకున్నారు.  పలు గ్రామాల్లోని   ఇండ్లపైన, బాల్కనీల్లో సాయంత్రం 5 గంటల తర్వాత ప్రజలు బయటకు వచ్చి చప్పట్ల ద్వారా విజయకేతనం చూపించారు.   జనతా కర్ఫ్యూకి సహకరించిన ప్రజలకు ఎంపీపీ హారిక, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు చప్పట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.  


సంపూర్ణంగా కర్ఫ్యూ

 శామీర్‌పేట : కరోనా వైర్‌సను పారదోలాలనే లక్ష్యంతో ఆదివారం శామీర్‌పేట మండలంలో ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలపుతూ జనతా కర్ఫ్యూను పాటించారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలపు మేరకు శామీర్‌పేట మండలంలోని వివిధ గ్రామాలు, తూంకుంట మున్సిపల్‌ పరిధిలో వివిధ ప్రాంతాల ప్రజలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బయటకు   ఇళ్లకే పరిమితమయ్యారు.    జనతా కర్ఫ్యూను  సంపూర్ణంగా   పాటించారు.   జనతా కర్ఫ్యూలో భాగంగా శామీర్‌పేట మండలంలోని వివిధ గ్రామాల్లో తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని వ్యాపారులు వారి వారి   దుకాణాలను స్వచ్చందంగా మూసివేస్తూ బంద్‌ను పాటించారు. మండలంలోని పెట్రోల్‌ పంపులు, డాబా హోటల్‌, వైన్స్‌లను, కిరాణ దుకాణాలను, హోటళ్లను వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌ చేశారు. అలాగే మండలంలోని రత్నాలయం, కట్టమైసమ్మ, శ్రీ రమాసహితసత్యనారాయణ, తదితర ఆలయాలను కూడ ధర్మకర్తలు, బ్రాహ్మణ పండితులు మూసివేసి జనతా కర్ఫ్యూను పాటించారు.  కరోనా వైరస్‌  నివారణ   వైద్యం చేస్తున్న డాక్టర్లను, ప్యారా మెడికల్‌ సిబ్బందిని   అభినందిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లను కొట్టారు. మండలంలోని వివిధ గ్రామాలు, మున్సిపల్‌ పరిధిలోని ప్రజలు, పిల్లలు, వృద్దులు, మహిళలు సామూహికంగా వారి వారి ఇళ్లల్లో,  గల్లీల్లో చప్పట్లు  కొట్టి వైద్యులను, పారిశుధ్య సిబ్బందిని అభినందించారు. అలాగే మండలంలోఏని అలియాబాద్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి జగదీ్‌షగౌడ్‌  కరోనా వైరస్‌  నివారణకు ప్రజలకు అవగాహన కల్పించారు.    తూంకుంట మున్సిపల్‌లో కరోనా వైరస్‌ పట్ల వైద్యులు అందిస్తున్న సేవలను అభినందిస్తూ బీజేపీ నాయకుడు రవీందర్‌ ప్రజలను చైతన్య పరుస్తూ యువకుల, మహిళలతో కలిసి  చప్పట్లు కొట్టారు.   


వైద్య సేవలందిస్తున్న మండలంలోని డాక్టర్లకు, ప్యారా మెడికల్‌ సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందిని అభినందిస్తూ సాయంత్రం 5 గంటలకు శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ ముందు రాజీవ్‌ రహాదారిలో ఇన్స్‌పెక్టర్‌ సంతోషం ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, అభిసందిస్తూ చప్పట్లను కొట్టారు.  శామీర్‌పేట మండలంలో ఆదివారం జనతా కర్ఫ్యూను   విజయవంతం చేసిన ప్రజలకు, పోలీసులకు, ప్రజాప్రతినిఽధులకు ఎంపీపీ ఎల్లుబాయి కృతజ్ఞతలు తెలిపారు.  కరోనా వైరస్‌ నివారణకు  వైద్య సేవలందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, ఆర్మీ జవాన్లకు, అఽఽధికారులకు, ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో  వైరస్‌ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌కు ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు. 


ఇళ్లకే పరిమితమైన ప్రజలు

 మేడ్చల్‌ : కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ మేడ్చల్‌లో విజయవంతమైంది.  రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారసముదాయులు బంద్‌ పాటించాయి. మేడ్చల్‌ రేల్వేస్టేషన్‌, బస్టాండ్‌ ప్రయాణికులు లేక వెలవెల పోయాయి.   రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసర సేవల్లో తప్ప మిగతా అన్ని సేవలు బంద్‌ పాటించాయి. 


Updated Date - 2020-03-23T06:24:34+05:30 IST