రేపటి నుంచి జన్‌ అదాలత్‌ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-12-07T04:42:04+05:30 IST

రేపటి నుంచి జన్‌ అదాలత్‌ కార్యక్రమాలు

రేపటి నుంచి జన్‌ అదాలత్‌ కార్యక్రమాలు

  • రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాంబల్‌నాయక్‌

షాద్‌నగర్‌ అర్బన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దళిత, గిరిజన హక్కుల పరిరక్షణకు ఈ నెల 8నుంచి మూడు రోజుల పాటు జన్‌ అదాలత్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాంబల్‌నాయక్‌ ఆదివారం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సత్వర న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 8న ఉదయం 11గంటలకు కల్వకుర్తి నియోజకవర్గంలోని మార్చాల గ్రామంలో దళిత గిరిజన వర్గాల సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. 9న రాత్రి దేవరకద్ర నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని సందర్శిస్తామని తెలిపారు. 9,10 తేదీల్లో మహబూబ్‌నగర్‌ రెవెన్యూ హాలులో మహబూబ్‌నగర్‌, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులను సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో తనతో పాటు కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, నీలాదేవి, సి.నరసింహ, కార్యదర్శి పాండాదా్‌స తదితరులు పాల్గొంటారని రాంబల్‌నాయక్‌ వివరించారు.


Updated Date - 2020-12-07T04:42:04+05:30 IST