తాండూరులో వంద పడకల ఐసోలేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2020-03-23T05:52:42+05:30 IST

తాండూరు పట్టణంలోని రాజీవ్‌ గృహక ల్ప సమీపంలో గల మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 100 పడకల ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను...

తాండూరులో వంద పడకల ఐసోలేషన్‌ కేంద్రం

  • మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
  • ఇక్కడే శాంపిల్స్‌ సేకరణ


తాండూరు: తాండూరు పట్టణంలోని రాజీవ్‌ గృహక ల్ప సమీపంలో గల మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 100 పడకల ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్‌ రాంచంద్రయ్య, ఆర్డీవో వేణుమాధవరావుతో కలి సి పనులను పరిశీలించారు. ఎన్ని బెడ్లు వస్తాయి, సౌకర్యాలు ఏమున్నాయనే వివరాలను కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు నిదానంగా చేస్తున్నారని, త్వర గా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. గ్రౌండ్‌, ఫస్ట్‌ఫ్లోర్లలో ఐసోలేష న్‌ కే ంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ శాంపుల్స్‌ సేకరించి నెగటివ్‌ వచ్చి న వారిని డిశ్చార్జ్‌ చేస్తామని అదనపు కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిని హైదరాబాద్‌ తరలిస్తామన్నారు. 

Updated Date - 2020-03-23T05:52:42+05:30 IST