బిజినెస్ పార్టీపై సోదాలు.. యువతులు అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-28T21:45:45+05:30 IST

తిమ్మాయిపల్లి రిడ్జ్ విల్లాలో బిజినెస్ పార్టీ జరిగిందని డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. స్థానికుల సమాచారంతో విల్లాలో సోదాలు చేసినట్లు చెప్పారు

బిజినెస్ పార్టీపై సోదాలు.. యువతులు అరెస్ట్

మేడ్చల్: తిమ్మాయిపల్లి రిడ్జ్ విల్లాలో బిజినెస్ పార్టీ జరిగిందని డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. స్థానికుల సమాచారంతో విల్లాలో సోదాలు చేసినట్లు చెప్పారు. బెస్ట్ క్రాప్ సీడ్స్ ఎండీతో పాటు ఐదుగురు డీలర్లు, ఐదుగురు యువతులు అరెస్ట్ చేశామన్నారు. విల్లాలో బెస్ట్ క్రాప్ సీడ్స్ కంపెనీ విందు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విందు కోసం ఏపీ నుంచి ఐదుగురు యువతులను తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విందు నిర్వహించారని డీసీపీ రక్షితమూర్తి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-28T21:45:45+05:30 IST