కరోనా నేపథ్యంలో వాహనాల తనిఖీ
ABN , First Publish Date - 2020-03-16T06:08:20+05:30 IST
కరోనా నేపథ్యంలో శంషాబాద్‌లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకుండా ఎయిర్‌పోర్టు పోలీసులు ముందస్తుగా శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు.
శంషాబాద్ : కరోనా నేపథ్యంలో శంషాబాద్‌లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకుండా ఎయిర్‌పోర్టు పోలీసులు ముందస్తుగా శంషాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ తొలిసారిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు శంషాబాద్‌లో ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. కరోనా నేపధ్యంలో ర్యాలీతో పాటు రాజకీయ పార్టీ ఊరిగిపులకు అనుమతులు ఇవ్వడంలేదు. ప్రజలను గుమిగూడనీయకుండా వాహనాలు తనిఖీ చేపట్టారు. అంబేద్కర్‌చౌరస్తా, ఎయిర్‌పోర్టు చౌరస్తా, ఆర్బీనగర్, మధురానగర్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టారు.