ఘనంగా బసవేశ్వర విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2020-02-08T11:41:06+05:30 IST
మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామ సబ్‌స్టేషన్ చౌరస్తాలో శుక్రవారం మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీరశైవలింగాయత్, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో

కులకచర్ల: మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామ సబ్‌స్టేషన్ చౌరస్తాలో శుక్రవారం మహాత్మ బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీరశైవలింగాయత్, లింగబలిజ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చౌడాపూర్, మందిపాల్, మక్తవెంకటాపూర్ గ్రామాలకు చెందిన వీరశైవలింగాయత్, లింగబలిజ సంఘం నాయకులు రాజశేఖర్, ఽశరభలింగం, శివకుమార్, అశోక్, శంభులింగం, రాజు, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహం ఏర్పాటుకు సహకరించిన వారందరికి ఈ సందర్భంగా సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. వీరశైవ కులస్థుల అభివృద్దికోసం బసవేశ్వరుడు ఎంతగానో కృషి చేశారని తెలిపారు.