ఇంటికి కొత్తవారొస్తే రూ.వేయి జరిమానా

ABN , First Publish Date - 2020-03-25T12:08:19+05:30 IST

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పరిగి మండలం నజీరాబాద్‌ పంచాయతీలోకి కొత్తగా ఎవరైన వస్తే, ఆఇంటి యజమానికి రూ.1000 జరిమానా...

ఇంటికి కొత్తవారొస్తే రూ.వేయి జరిమానా

నజీరాబాద్‌ పంచాయతీ తీర్మానం

పరిగి: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పరిగి మండలం నజీరాబాద్‌ పంచాయతీలోకి కొత్తగా ఎవరైన వస్తే, ఆఇంటి యజమానికి రూ.1000 జరిమానా విధించాలని తీర్మాణించారు. పంచాయతీ పరిధిలోని నివసిస్తున్న వారి దగ్గరకు బంధువులుగానీ, స్నేహితులుగానీ, ఇతరులు కొత్తగా ఎవరూ రాకూడదని తీర్మానం చేశారు. ఈ నిబంధనను ప్రతి ఒక్కరూ పాటించాలని గ్రామ సర్పంచ్‌ గణేశ్‌ ఒక ప్రకటనలో కోరారు. తీర్మానాన్ని ఉల్లంఘించిన వారికి  వేయిరూపాయల  జరిమానా విధిస్తామని ఆయన పేర్కొన్నారు.


Read more