భార్య వద్దకు బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది..?

ABN , First Publish Date - 2020-07-27T17:35:43+05:30 IST

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడంగల్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన శేఖర్‌ (45) శనివారం రాత్రి తాండూర్‌ మండలంలోని

భార్య వద్దకు బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది..?

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


కొడంగల్‌ (రంగారెడ్డి): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడంగల్‌ మండలం రుద్రారం గ్రామానికి చెందిన శేఖర్‌ (45) శనివారం రాత్రి తాండూర్‌ మండలంలోని చెంగోల్‌కు భార్య వద్దకు బైక్‌పై బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఉడిమేశ్వరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇదిలా ఉండగా మృతుడి కుటుంబ సభ్యులు భూవివాదాల కారణంగానే శేఖర్‌ను హత్య చేశారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.


ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ముగ్గురు అనుమానితులపై మృతుడి భార్య సువర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈసంఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదికలో హత్యా, ప్రమాదమా అనే విషయం నిర్ధారణయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2020-07-27T17:35:43+05:30 IST