రియల్ ఎస్టేట్ వ్యాపారుల హైవే దిగ్బంధం భగ్నం
ABN , First Publish Date - 2020-12-30T05:12:54+05:30 IST
రియల్ ఎస్టేట్ వ్యాపారుల హైవే దిగ్బంధం భగ్నం
ఘట్‌కేసర్ : ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ పట్టణంలోని చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌లోని ఓఆర్‌ఆర్ చౌరస్తావద్దహైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి దిగ్బాంధానికి పిలుపుపిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయం 9 గంటలకే పెద్దసంఖ్యలో జాతీయ రహదారిపై మోహరించారు. ఇంతలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ మరికొందరు వ్యాపా రులతో కలిసి అక్కడికి చేరుకున్నారు, ఇంతలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేసి డీసీఎంలో పోలీసు స్టేషన్‌కు తరలించారు.