గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు నిధులివ్వాలి

ABN , First Publish Date - 2020-12-27T05:39:09+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు నిధులివ్వాలి

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు నిధులివ్వాలి
విజేతలకు షీల్డ్‌ అందజేస్తున్న అచారి

  • జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి

కొత్తూర్‌: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు టి.ఆచారి పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని  తిమ్మాపూర్‌లో జిల్లా కార్యదర్శి ఆమడపురం నర్సింహగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్టీ పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచారి హాజరై విజేతలకు షీల్డ్‌లను బహూకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, విరివిగా నిధులు మంజూరు చేయాలన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, బావండ్ల మాణిక్యం, రాఘవులు, వెంకటయ్య, వంశీకృష్ణ, రిషికేష్‌, నర్సింహ, శ్రీశైలం పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:39:09+05:30 IST