డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలి
ABN , First Publish Date - 2020-12-29T04:52:53+05:30 IST
డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : దివ్యాంగులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని దివ్యాంగుల డెవల్‌పమెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2 లక్షలపైగా దివ్యాంగులు ఉన్నారని, ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధర్నాలో వెంకటే్‌షగౌడ్, భారతి పాల్గొన్నారు.